ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
  • వైరా, ఇల్లందు ఎమ్మెల్యేలు వెళ్తున్న కారును ఢీకొట్టిన మరో వాహనం
  • ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఘటన

కారేపల్లి, వెలుగు : వైరా, ఇల్లందు ఎమ్మెల్యేలు రాందాస్‌‌‌‌నాయక్‌‌‌‌, కోరం కనకయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇద్దరు కలిసి ఒకే వాహనంలో వస్తుండగా ఎమ్మెల్యేలు ఉన్న కారు ఒకేసారి స్లో కావడంతో వెనుక ఉన్న వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఉసిరికాయపల్లి సోలార్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ సమీపంలో ఆదివారం జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వైరా ఎమ్మెల్యే రాందాస్‌‌‌‌నాయక్‌‌‌‌ తన కారులో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి కారేపల్లి మండలంలోని కోట మైసమ్మ జాతరకు బయలుదేరారు. సోలార్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ మూలమలుపులో ఎమ్మెల్యే వాహనం ఒక్కసారిగా స్లో కావడంతో వెనుకాల ఉన్న కారు ఎమ్మెల్యేలు ఉన్న కారును ఢీకొట్టింది. దాని వెనుకే వరుసగా మరో మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో డ్యామేజ్‌‌‌‌ అయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.